సింగపూర్‌లో కరోనా తగ్గుముఖం-కనిష్ఠ కేసులు నమోదు! - కరోనా లేటెస్ట్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల ఒక లక్షా 2 వేలు దాటింది. ఇప్పటివరకు 9 లక్షల 46 వేల మందికిపైగా కొవిడ్‌కు బలయ్యారు. రష్యాలో 5 వేలు, మెక్సికోలో 4 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 6 నెలల తర్వాత సింగపూర్‌లో అతితక్కువగా 18 కేసులు నమోదయ్యాయి.
Global COVID-19 tracker
కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో రోజూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికోలపై వైరస్ ప్రభావం అధికంగా ఉంది. మొత్తం కేసులు 3 కోట్ల, ఒక లక్ష దాటాయి. మరణాల సంఖ్య 9 లక్షల 46 వేలను అధిగమించింది.
- రష్యాలో గురువారం ఒక్కరోజు 5, 762 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 144 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 19 వేలు దాటింది.
- మెక్సికోలో మరో 4444 కేసులు.. 300 మరణాలు నమోదయ్యాయి.
- అర్జెంటీనా, ఇరాన్, ఇండోనేసియాలో కరోనా తీవ్రత పెరిగిపోతోంది. రోజూ వందమందికిపైగా చనిపోతున్నారు.
- నేపాల్‌లో కరోనా కేసులు 60 వేలకు సమీపంలో ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 12 వందలమందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. ఆ దేశంలో ఇప్పటివరకు 383 మంది చనిపోయారు.
- దక్షిణాఫ్రికాలో కోటీ 20 లక్షల మందికిపైగా కరోనా బారినపడి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ దేశ ఆరోగ్య మంత్రి. అయితే మరణాల రేటు మాత్రం ఆ స్థాయిలో లేదన్నారు. అధికారిక లెక్కల ప్రకారం సౌతాఫ్రికాలో ఇప్పటివరకు 6 లక్షల 53 వేల మందికిపైగా కరోనా సోకింది. 15 వేల 705 మంది మరణించారు.
- సింగపూర్‌లో గురువారం 18 మందికి కరోనా సోకింది. గత 6 నెలల్లో ఇదే అత్యల్పం. దేశంలో మొత్తం కేసులు 57 వేల 532కు చేరాయి. కరోనా వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో.. సింగపూర్‌లో చదువుకునే విదేశీయులు కొత్త సెమిస్టర్ల కోసం ఇప్పుడిప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు.
Last Updated : Sep 17, 2020, 9:43 PM IST