తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విధ్వంసం- కొలంబియాలో 20 వేల మరణాలు - కరోనా

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 2 లక్షల 59 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 5877 మంది మరణించారు. కేసుల సంఖ్య రెండు కోట్ల 58 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 8.60 లక్షలకు చేరింది. ప్రస్తుతం 68 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కోటి 18 లక్షల మంది రికవరీ అయ్యారు.

Global COVID-19 tracker
కరోనా విధ్వంసం- కొలంబియాలో 20 వేల మరణాలు

By

Published : Sep 2, 2020, 8:26 AM IST

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,59,328 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 5,877 మంది మరణించారు.

  • మొత్తం కేసులు2,58,91,415
  • మొత్తం మరణాలు8,60,301
  • యాక్టివ్ కేసులు68,44,928
  • రికవరీలు1,81,86,186
  1. అమెరికాలో మంగళవారం 41,979 మంది కరోనా బారినపడ్డట్లు వెల్లడైంది. మరో 1,164 మంది మరణించారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 62.57 లక్షలు దాటింది. మరణాల సంఖ్య లక్షా 90 వేలకు చేరువైంది.
  2. బ్రెజిల్​లోనూ కరోనా మరింత తీవ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 41,889 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 1,166 మంది మరణించారు. బ్రెజిల్ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 39.52 లక్షలకు పెరిగింది.
  3. రష్యాలో బాధితుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. కొత్తగా 4,729 కేసులు గుర్తించారు అధికారులు.
  4. అర్జెంటీనాలో కొవిడ్ విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజే పదివేలకుపైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4.28 లక్షలకు పెరిగింది. మరో 259 మంది కరోనా ధాటికి మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 8,919కి చేరింది.
  5. స్పెయిన్​లో కొవిడ్ మరోసారి కోరలు చాస్తోంది. 8,115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితులు 4.70 లక్షలకు చేరారు.
  6. కొలంబియాలో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. గత 24 గంటల్లో 389 మంది మృత్యువాతపడ్డారు. 8,901 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.

వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 62,57,571 1,88,900
బ్రెజిల్​ 39,52,790 1,22,681
రష్యా 10,00,048 17,299
పెరూ 6,57,129 29,068
దక్షిణాఫ్రికా 6,28,259 14,263
కొలంబియా 6,24,069 20,052
మెక్సికో 599,560 64,414

ABOUT THE AUTHOR

...view details