తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: రెండు కోట్ల 38 లక్షలకు కేసులు - కరోనా లేటెస్ట్ అప్​డేట్

ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గరిష్ఠాలకు చేరుతోంది. ఇప్పటివరకు మొత్తం రెండు కోట్ల 38 లక్షలకుపైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడ్డారు. 8.18 లక్షల మంది మరణించారు.

Global COVID-19 tracker
కరోనా పంజా: రెండు కోట్ల 38 లక్షలకు కేసులు

By

Published : Aug 25, 2020, 8:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల 38 లక్షలకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం నాటికి మరో 62 వేల కేసులు నమోదయ్యాయి. 1,455 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8.18 లక్షలకు పెరిగింది.

  • మొత్తం కేసులు: 2,38,65,546
  • మరణాలు:8,18,127
  • యాక్టివ్ కేసులు:66,41,578
  • కోలుకున్నవారు:1,64,05,841

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువవుతోంది. మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు లక్షా 81 వేల మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

రష్యాలో మరో 120 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 16,568కి చేరింది. కొత్తగా నమోదైన 4,696 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 9.66 లక్షలు దాటింది.

స్కూళ్లు బంద్

దక్షిణ కొరియాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వల్ల రాజధాని ప్రాంతంలోని పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండు వారాల్లో 193 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆన్​లైన్ పద్ధతిలోనే పాఠాలు బోధించనున్నట్లు ఆ దేశ విద్యా శాఖ మంత్రి పేర్కొన్నారు.

దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 17,945 కేసులు నమోదయ్యాయి. ఇందులో 310 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

సింగపూర్

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని సింగపూర్ వైద్య శాఖ మంత్రి గన్ కిమ్ యోంగ్ వ్యాఖ్యానించారు. అయితే బాధితులందరికీ వైద్యం అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

సింగపూర్​లో తాజాగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి తర్వాత ఇదే అత్యల్పం.

నేపాల్

కాఠ్​మాండూ లోయలో లాక్​డౌన్​ను సెప్టెంబర్ 2 వరకు పొడగిస్తూ నేపాల్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో కొత్తగా 855 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 33,533కి పెరిగింది.

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 59,17,479 1,81,204
బ్రెజిల్​ 36,27,217 1,15,451
రష్యా 9,66,189 16,568
దక్షిణాఫ్రికా 6,11,450 13,159
పెరూ 6,00,438 27,813
మెక్సికో 5,63,705 60,800

ABOUT THE AUTHOR

...view details