ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. వివిధ దేశాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే 47వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 67 లక్షల 40వేల మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 3లక్షల 94 వేలకు చేరువైంది. అయితే కొవిడ్-19 నుంచి ఇప్పటివరకు 32లక్షల 74 వేలమంది కోలుకున్నారు.
ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజులో 47వేలమందికి వైరస్ - world corona virus
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 67లక్షల 40వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 4లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 32లక్షల 73 వేలమంది వైరస్ నుంచి విముక్తి పొందారు.
ప్రపంచంపై కరోనా పంజా
అమెరికాలో కొత్తగా 2,218 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 19లక్షల 26వేలకు పైగా ఉంది. లక్షా 10వేల మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. బ్రెజిల్లో కొత్తగా 2,600 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల18 వేలు దాటింది. మొత్తంగా 34వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో మరో 4,000 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి:లాక్‌డౌన్‌తో పిల్లల్లో ఊబకాయం మరింత తీవ్రం!