దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ఓ మినీ విమానం ప్రమాదానికి గురైంది. టేక్ఆఫ్ చేస్తున్న క్రమంలో విమానాశ్రయం చుట్టూ ఉండే కంచెను ఢీకొట్టి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కూలిన విమాన ప్రాంతంలో గాలింపు చర్యాలు చేపట్టిన అగ్నినమాపక అధికారులు ఇదీ జరిగింది...
కాలిఫోర్నియాలోని కరోనా మున్సిపల్ విమానాశ్రయం నుంచి టేక్ఆఫ్ అవుతున్న క్రమంలో మూడు అడుగుల ఎత్తుగల కంచెను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వెంటనే మంటలు అంటుకుని రన్‌వేకు కొద్ది దూరంలో కూలిపోయినట్లు వెల్లడించారు.
విమానాశ్రయానికి తూర్పు భాగంలో దగ్ధమైన విమానాన్ని గుర్తించారు అధికారులు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందినట్లు నిర్ధరించారు అధికారులు.
విమానాశ్రయానికి అతి సమీపంలో ప్రమాదం జరిగిన కారణంగా రన్‌వేను మూసివేశారు అధికారులు. ఇక్కడకు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు.
ఇదీ చదవండి:రహదారి నిర్మాణ యంత్రాలను తగలబెట్టిన నక్సల్స్