"దయచేసి నా గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు" అని విలవిలలాడిపోతూ, అతను వెలిబుచ్చిన ఆవేదన ఆ పోలీసు అధికారి ముందు అరణ్య రోదన అయింది. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి ఈ దుర్మార్గం చోటుచేసుకుంది.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఆఫ్రికన్ అమెరికన్ కనిపించాడు. కారు నుంచి వెలుపలికి రావాల్సిందిగా ఆదేశించారు. బయటకు రాగానే జార్జ్‌ను నేలపైకి పడగొట్టారు. సంకెళ్లు వేశారు. ఈ క్రమంలో జార్జ్ మెడపై పోలీసు అధికారి ఒకరు మోకాలు బలంగా ఆనించాడు.