Woman Cured of HIV: హెచ్ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనల్లో మరో అశావహ ముందడుగు! అమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్ఐవీ నుంచి విముక్తి పొందారు. ఇలా స్వస్థత పొందినవారిలో ఆమె మూడో వ్యక్తి కాగా, మహిళల్లో మొదటివారు. 'రెట్రోవైరస్లు-అంటువ్యాధులు'పై మంగళవారం నిర్వహించిన సందస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్డ్ స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో హెచ్ఐవీ నుంచి విముక్తి పొందవచ్చని నిర్ధారణకు వచ్చినట్టు వారు ప్రకటించారు.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, మెటర్నల్ పీడియాట్రిక్ ఆడోలెసెంట్ ఎయిడ్స్ క్లినికల్ ట్రయల్ నెట్వర్క్ (ఇంపాక్ట్), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కేసులో పరిశోధన సాగించారు. ఇంపాక్ట్ సంస్థ 2015 నుంచి మొత్తం 25 మంది హెచ్ఐవీ బాధితులపై పరిశోధనలు సాగిస్తోంది.