తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్​ను ఓడిస్తేనే కరోనాపై గెలుపు సాధ్యం' - అమెరికా అధ్యక్ష ఎన్నికల వార్తలు

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఓటమితోనే కరోనా మహమ్మారిపై విజయంలో మొదటి అడుగు వేయగలమని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అన్నారు. పిట్స్​బర్గ్​లో ఎన్నికల ప్రచార ముగింపు సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.

US-BIDEN
బైడెన్

By

Published : Nov 3, 2020, 10:25 AM IST

అమెరికా పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై గెలవాలంటే ముందుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను ఓడించాలని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అన్నారు. పిట్స్​బర్గ్​లో ప్రచార ముగింపు సభలో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్ల పాలనలో విఫలమైనందుకు ట్రంప్​ను ఓడించాలని పిలుపునిచ్చారు.

"నేనిచ్చే సందేశం చాలా చిన్నదే. ఈ దేశాన్ని మార్చే అధికారం మీ చేతుల్లో ఉంది. ట్రంప్ తరహాలో ఓటును అణచివేయడానికి ఆధునిక అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఇటీవల ఓ వార్తా కథనం చదివాను. ట్రంప్ ఎంత గట్టిగా ప్రయత్నిస్తారన్నది నేను పట్టించుకోను. కానీ, మిమ్మల్ని ఓటు వేయకుండా ఆయన ఆపలేరు. ఆయన ఓటమితోనే కరోనా వైరస్​ను గెలవగలం."

- జో బైడెన్, డెమొక్రటిక్ అభ్యర్థి

ట్రంప్​ వల్ల దేశంలో ఎంతో గందరగోళం నెలకొందని బైడెన్​ విమర్శించారు. జాత్యాహంకారం, కోపం, ద్వేషం, బాధ్యతారాహిత్యం.. ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. తాను అధ్యక్షుడినైతే.. మొదటి రోజు నుంచే కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బైడెన్​ 18 నెలల ముందు పిట్స్​బర్గ్​లోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారాన్ని కూడా ఇక్కడే ముగించారు.

ఇదీ చూడండి:అమెరికా చరిత్రలో రికార్డు ఓటింగ్​!

ABOUT THE AUTHOR

...view details