తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ టీకా తీసుకుంటే అతికొద్ది మందికి అరుదైన వ్యాధి!

జాన్సన్​ టీకాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ టీకాకు నూతన హెచ్చరిక జారీచేసింది అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ. ఈ వ్యాక్సిన్​ తీసుకున్నవారు అరుదైన నాడీ సంబంధ రుగ్మత బారినపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

vaccine
కరోనా టీకా

By

Published : Jul 13, 2021, 12:42 PM IST

జాన్సన్​ అండ్ జాన్సన్​ కరోనా టీకాకు కొత్త హెచ్చరిక జారీ చేసింది అమెరికాల ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ). ఈ టీకాతో అరుదైన నరాల వ్యాధికి సంబంధం ఉండొచ్చని, అయితే అది నిర్ధరణ కాలేదని సోమవారం తెలిపింది.

జాన్సన్​ టీకా తీసుకొని, గులెయిన్ బారే వ్యాధి బారిన పడిన 100 మంది రిపోర్టులను సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్ ప్రివెన్షెన్​(సీడీసీ)తో పాటు సమీక్షించిన తర్వాత ఎఫ్​డీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. వారిలో అందరూ ఆస్పత్రి పాలు కాగా, ఒకరు మరణించారు.

గులెయిన్ బారే అంటే..

శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున సొంత నాడీ కణాలపై దాడి చేసినప్పుడు గులెయిన్ బారే సంభవిస్తుంది. దీంతో కండరాల బలహీనత ఏర్పడుతుంది. కొన్నిసార్లు పక్షవాతం బారినపడొచ్చు. ఏటా 3వేల నుంచి 6 వేల మందికి పలు కారణాలతో ఈ వ్యాధి సోకుందని సీడీసీ అంచనా.

చాలా స్వల్పమే..

అయితే ఇప్పటివరకు 1.3 కోట్ల మంది అమెరికన్లు జాన్సన్​ టీకా తీసుకోగా, ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య చాలా స్వల్పం. 50 ఏళ్లు పైబడిన వారిలో టీకా తీసుకున్న 2 వారాల తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్​ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఈ నివేదికలపై ఎఫ్​డీఏ సహా ఇతర ఆరోగ్య నియంత్రణ సంస్థలతో చర్చిస్తున్నట్లు జాన్సన్ తెలిపింది. కాగా, ఈ వ్యవహారంపై టీకా నిపుణుల వెలుపలి ప్యానెల్​ని సమీక్షించమని కోరనున్నట్లు సీడీసీ వెల్లడించింది.

ఈ లక్షణాలతో జాగ్రత్త..

జాన్సన్​ టీకా తీసుకునేవారికి ఇచ్చే పాంప్లెట్​లో కొత్త హెచ్చరికను ఎఫ్​డీఏ చేర్చనుంది. దాని ప్రకారం జలదరింపులు, నడవటంలో ఇబ్బంది, ద్వంద్వ దృష్టి లాంటి లక్షణాలున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇదీ చూడండి:Johnson&Johnson: 'డెల్టాపై సింగిల్​ డోస్ వ్యాక్సిన్​​ ప్రభావం​ భేష్​'

ABOUT THE AUTHOR

...view details