తెలంగాణ

telangana

ETV Bharat / international

'కొత్త రకం కరోనాను తేలికగా తీసుకోలేము' - britain

కరోనా కొత్త స్ట్రెయిన్​ ప్రమాదకరమైనదిగా భావించట్లేదని అమెరికా వైద్య నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీ తెలిపారు. కానీ వైరస్​ను తేలికగా తీసుకోలేమని, దీనిపై లోతుగా పరిశోధనలు జరపాలన్నారు.

us corona, vaccine, corona new strain
'కొత్తరకం కరోనాను తేలికగా తీసుకోలేము'

By

Published : Dec 28, 2020, 10:48 AM IST

కరోనా కొత్త స్ట్రెయిన్​ను తేలికగా తీసుకోలేమని అమెరికా వైద్య నిపుణుడు డా.ఆంటోనీ ఫౌచీ తెలిపారు. కొత్త రకం వైరస్​ను లోతుగా పరిశీలిస్తున్నామని అన్నారు. బ్రిటన్​ సహా వేర్వేరు దేశాల్ని బెంబేలెత్తిస్తున్న ఈ కొత్త రకం ప్రమాదకరం కాదని భావిస్తున్నామని తెలిపారు.

నెగెటివ్​ వస్తేనే..

బ్రిటన్​ నుంచి వచ్చేవారికి కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​ వస్తేనే అమెరికాలో అనుమతి లభిస్తుందన్న అధికారుల నిర్ణయాన్ని ఫౌచీ సమర్థించారు.

"కొత్త స్ట్రెయిన్ తీవ్ర అస్వస్థతకు గురిచేస్తుందా? ఈ వైరస్​కు అంత తీవ్రత ఉందా? ఈ వైరస్ అంత ప్రమాదకారిగా కనిపించట్లేదు అనేదే ఈ ప్రశ్నలకు సమాధానం."

-డా. ఆంటోనీ ఫౌచీ, అమెరికా వైద్య నిపుణుడు

ఇదీ చూడండి :పట్టు వీడిన ట్రంప్- కొవిడ్ ప్యాకేజీపై సంతకం

ABOUT THE AUTHOR

...view details