తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో అలజడులకు చైనా నెట్​వర్క్ కుట్ర

అమెరికా, ఫిలిప్పీన్స్​ సహా పలు దేశాల్లో రాజకీయ అలజడులు సృష్టించే లక్ష్యంతో చైనా కేంద్రంగా పనిచేస్తున్న పనిచేస్తున్న నకిలీ ఖాతాల నెట్​వర్క్​ను ఫేస్​బుక్ తొలగించింది. అమెరికా అధ్యక్షుడి బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్​లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఈ ఖాతాల నుంచి పోస్టులు పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. అయితే చైనా ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని నేరుగా వెల్లడించలేదు.

facebook chinese network
అమెరికాలో అలజడులకు చైనా నెట్​వర్క్ కుట్ర

By

Published : Sep 24, 2020, 7:30 AM IST

Updated : Sep 24, 2020, 9:12 AM IST

అమెరికా, మరికొన్ని దేశాల్లో రాజకీయ అలజడులను సృష్టించే లక్ష్యంతో... చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఫేస్​బుక్ నకిలీ ఖాతాల నెట్​వర్క్​ను ఆ సంస్థ తొలగించింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, వీట్ బూటిజీజ్​లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఈ పేజీల్లో పోస్టులు పెడుతున్నట్టు ఫేస్​బుక్ తెలిపింది. కొందరు వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టి, ప్రైవేటు నెట్​వర్క్​ల ద్వారా వర్చువల్ లొకేషన్ల నుంచి వీటిని నడిపిస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఈ వ్యవహారంతో చైనా ప్రభుత్వానికి సంబంధమున్నట్టు ఫేస్​బుక్ సూటిగా వెల్లడించలేదు.

మరోవైపు... ప్రపంచ పరిణామాల గురించి దక్షిణాసియాలో కూడా ఈ నెట్​వర్క్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు ఆ సంస్థ వివరించింది. 2022లో ఫిలిప్పీన్స్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టె, ఆయన కుమార్తెకు అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న స్థానిక నెట్​వర్క్​ని కూడా తొలగించినట్టు ఫేస్​బుక్ వెల్లడించింది.

ఎన్నికల వెబ్​సైట్​పై దాడికి ప్రయత్నాలు?

నకిలీ వెబ్ సైట్లు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విషయంలో గందరగోళం సృష్టించేందుకు సైబర్ సైబర్ నేరగాళ్లు ప్రయత్నించే ముప్పుందని ఎఫ్​బీఐ మంగళవారం హెచ్చరించింది. ఒకవేళ ఎన్నికల వెబ్​సైట్ దాడికి గురైనా, అందులోని సమాచారానికి ముప్పు ఉండబోదని పేర్కొంది. నిఘా వర్గాలు గత నెలలోనే ఇందుకు సంబంధించి అధికారులను అప్రమత్తం చేశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు చైనా, రష్యా, ఇరాన్లు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాయి.

రష్యా టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాలు ట్రంపనకు అనుకూలంగా, బైడెన్​కు ప్రతికూలంగా పనిచేస్తున్నట్టు తెలిపాయి. ఎన్నికల భద్రతకు రష్యా నుంచి ముప్పు ఉందని ఎఫ్​బీఐ డైరెక్టర్ క్రిస్ వే గతవారం హెచ్చరించగా... రష్యా కంటే చైనా నుంచే ఎక్కువ ముప్పుందని అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. "బైడెన్ చేతిలో ట్రంప్ చిత్తుగా ఓడిపోయేలా బీజింగ్ ప్రయత్నిస్తోంది" అని అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విలియం ఈవా నియా పేర్కొన్నారు.

ఇదీ చదవండి-కొందరి గుప్పిట్లో అందరి సంస్థ

Last Updated : Sep 24, 2020, 9:12 AM IST

For All Latest Updates

TAGGED:

.

ABOUT THE AUTHOR

...view details