తెలంగాణ

telangana

ETV Bharat / international

'అసాంజేను శిక్షించేందుకు అప్పగించలేదు'

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే అరెస్టుపై స్పందించింది ఇప్పటి వరకు ఆశ్రయం కల్పించిన ఈక్వెడార్. మరణశిక్ష అమలవుతున్న ఏ దేశానికీ అప్పగించమన్న హామీని పొందిన అనంతరమే అసాంజేను బ్రిటన్​ అరెస్ట్ చేసేందుకు అంగీకరించామని ప్రకటించింది.

అసాంజేను శిక్షించేందుకు అప్పగించలేదు: ఈక్వెడార్

By

Published : Apr 12, 2019, 4:30 AM IST

Updated : Apr 12, 2019, 7:59 AM IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే అరెస్టుపై స్పందించింది ఇప్పటివరకు అతనికి ఆశ్రయం కల్పించిన ఈక్వెడార్. అసాంజే భద్రత విషయంలో అవసరమైన హామీలు రాతపూర్వకంగా పొందిన తర్వాతే బ్రిటన్​కు అప్పగించామని ప్రకటించారు ఈక్వెడార్​ అధ్యక్షుడు లెనిన్​ మొరినో.

"వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేను మరణ శిక్ష అమలువుతోన్న ఏ దేశానికీ అప్పగించబోమని బ్రిటన్​ నుంచి రాతపూర్వక హామీ పొందిన తర్వాతే అప్పగించాం."-లెనిన్ మొరినో, ఈక్వెడార్​ అధ్యక్షుడు

అసాంజేకు రక్షణను ఉపసంహరించుకునేందుకు తమకు సంపూర్ణ స్వేచ్ఛ ఉందని అంతకుముందు ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. పదే పదే అసాంజే నిబంధనలను ఉల్లంఘించడం సరికాదన్నారు.

పౌరసత్వం తొలగింపు...

జులియన్ అసాంజేకు ఇచ్చిన పౌరసత్వాన్ని తొలగించింది ఈక్వెడార్ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని అసాంజే అరెస్టుకు ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి జోస్ వాలెన్షియా ప్రకటించారు. 2017లో అసాంజేకు పౌరసత్వాన్ని కల్పించింది ఈక్వెడార్​. అంతర్జాతీయ నిబంధనల మేరకే నడుచుకున్నామని స్పష్టం చేసింది. తమ రక్షణలో ఉన్నప్పుడు శరణార్థి నిబంధనలను అసాంజే ఉల్లంఘించారన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

Last Updated : Apr 12, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details