తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒకేసారి 88 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన స్పేస్​ఎక్స్ - 88 ఉపగ్రహాలు పంపిన స్పేస్ ఎక్స్

స్పేస్​ ఎక్స్ అంతరిక్ష ప్రయోగ సంస్థ మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఒకేసారి 88 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ ఏడాది మొత్తంగా 900 ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లు స్పష్టం చేసింది.

space X
స్పేస్ ఎక్స్, మస్క్

By

Published : Jul 3, 2021, 12:41 PM IST

ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధినేత ఎలాన్​ మస్క్ స్థాపించిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్​ఎక్స్​ అరుదైన ఘనత సాధించింది. ఫ్లోరిడా కేంద్రంగా చేపట్టిన రెండో 'రైడ్ షేర్' మిషన్​లో భాగంగా 88 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు స్పేస్​ ఎక్స్ పేర్కొంది. ఈ ఏడాదిలో మొత్తంగా 900 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఓ స్థానిక మీడియా కథనం ప్రచురించింది.

ట్రాన్స్​పోర్టర్​-2 మిషన్ కోసం పునర్వినియోగ పాల్కన్-9 రాకెట్​ ద్వారా​ బుధవారం ఈ ప్రయోగం జరిపినట్లు స్పేస్​ ఎక్స్ స్పష్టం చేసింది. ఫ్లోరిడాలోని కేప్ కనవెరల్ స్పేస్​ ఫోర్స్​ స్టేషన్​ నుంచి రైడ్​ షేర్​ మిషన్​ను విజయవంతం చేసినట్లు వెల్లడించింది.

20వ ప్రయోగం..

ఈ మిషన్​లో భాగంగా ఫ్లోరిడా కేంద్రంగా స్పేస్​ ఎక్స్ ఉపగ్రహాలను పంపడం ఇది రెండోసారి కాగా.. ఈ ఏడాదిలో స్పేస్​ ఎక్స్​కు ఇది 20వ ప్రయోగం కావడం గమనార్హం.

ప్రస్తుత మిషన్​లో 85 కమర్షియల్, ప్రభుత్వ స్పేస్​ క్రాఫ్ట్​లు కాగా మూడు స్టార్​లింక్​ ఉపగ్రహాలున్నాయి. ఇందులో క్యూబ్ సాట్స్, మైక్రోసాట్స్, ఆర్బిటర్ ట్రాన్స్​ఫర్ వెహికిల్స్ ఉన్నాయి.

జనవరిలో ట్రాన్స్​పోర్టర్-1 మిషన్​ ద్వారా అత్యధికంగా 143 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది స్పేస్​ ఎక్స్. ప్రస్తుతం ట్రాన్స్​పోర్టర్-2 పేరిట మరికొన్ని ఉపగ్రహాలను పంపింది.

ఇదీ చదవండి:అంతరిక్ష కేంద్రానికి పయనమైన పునర్వినియోగ నౌక!

ABOUT THE AUTHOR

...view details