తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​ కాల్పుల్లో 8 మంది మృతి - కాల్పులు

బ్రెజిల్​ సావోపా నగరంలోని పాఠశాలలో ఇద్దరు ఆగంతుకులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. దుండగులు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కాల్పుల్లో ఎనిమిది మంది మృతి

By

Published : Mar 14, 2019, 7:36 AM IST

Updated : Mar 14, 2019, 10:57 AM IST

బ్రెజిల్​ కాల్పుల్లో 8 మంది మృతి
బ్రెజిల్ సావోపానగరంలో ఇద్దరు ఆగంతుకులు తుపాకులతో బీభత్సం సృష్టించారు. ఓ పాఠశాలలో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం తమను తాము కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మొత్తంగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. మరో 15 మంది గాయపడ్డారు. నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరూ మైనర్లేనని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

ఘటనపై బ్రెజిల్ విద్యాశాఖ మంత్రి రికార్డో వెలెజ్ స్పందించారు.

"మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పాఠశాలలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో బాధ కలిగించింది."
- రికార్డో వెలెజ్, బ్రెజిల్ విద్యాశాఖ మంత్రి

గతంలోనూ..

బ్రెజిల్ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్​లో​ రియో డీ జనైరోలో ఇదే తరహా దాడి జరిగింది. నగరంలోని ఓ పాఠశాలలో పూర్వ విద్యార్థులు జరిపిన కాల్పుల్లో 12 మంది చిన్నారులు మరణించారు.

హింసాత్మకం

ప్రపంచంలో అత్యంత హింసాత్మక దేశంగా బ్రెజిల్​కు పేరుంది. 2017లో దేశవ్యాప్తంగా 64 వేల హత్యలు జరిగాయి. అంటే దేశంలో నివసించే లక్షమందిలో 31 మంది హత్యకు గురయ్యారు.

అధ్యక్షుడి వివాదాస్పద నిర్ణయం

తుపాకీ వాడకంపై బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జైర్ బోల్సోనరో కఠిన నిబంధనలు సడలించారు. ఎన్నికల ప్రచారంలో చేసిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు జైర్. ఇది వివాదాస్పదమైంది.

ఇదీ చూడండి:గ్యాస్​ సిలిండరే పేలిందా?

Last Updated : Mar 14, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details