ప్రస్తుతం చిన్న, చిన్న విషయాలకే గొడవలు పెట్టుకొని విడిపోతున్నారు దంపతులు. చిన్న కష్టం వచ్చినా ఒర్చుకోలేక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అలాంటి వారికి ఈ జంట ఆదర్శం. వీరి ఆప్యాయత, అనురాగాన్ని గుర్తించిన గిన్నిస్ వరల్డ్ సంస్థ.. ప్రపంచంలోనే ఎక్కువ రోజులు కలిసి జీవించిన దంపతులుగా సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ జంటే జూలియో మోరా తన భార్య వాల్డ్రామినా క్వింటెరోస్.
వీరు ప్రస్తుతం ఈక్వెడార్ రాజధాని క్విటోలో జీవిస్తున్నారు. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రస్తుతం పదవీ విరమణ చేసి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఉపాధ్యాయులుగా ఉన్న రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ వీరి వివాహానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. 1941 ఫిబ్రవరి 7న ఎల్బెలోన్ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం జూలియో వయసు 110, అతని భార్య వాల్డ్రామినా క్వింటెరోస్ 104. వివాహ అనంతరం ఎంతో సంతోషంగా జీవించారు. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకుని ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉన్నారు.