ప్రపంచ ధరిత్రి దినోత్సవం(ఏప్రిల్ 22) సందర్భంగా ప్రముఖ గాయకుడు లిల్ డికీ ఓ వీడియో విడుదల చేశాడు. 'వీ లవ్ ద ఎర్త్' అంటూ సాగే ఈ యానిమేటడ్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. భూమిపై జరిగే వాతావరణ మార్పులపై వ్యంగ్యంగా సందేశాన్నిచ్చారు.
'వీలైతే భూమిని ప్రేమిద్దాం డూడ్.. పోయేదేముంది?' - డికీ
అమెరికన్ గాయకుడు లిల్ డికీ ఓ యానిమేటెడ్ వీడియోను విడుదల చేశాడు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం(ఏప్రిల్ 22) సందర్భంగా సందేశాత్మకంగా రూపొందించాడు. ఈ వీడియోకు 32 మంది హాలీవుడ్ నటులు, ప్రముఖులు తమ గొంతును అరువిచ్చారు.
భూమి
"ఇన్ని రోజులు వాతావరణంలో ఎన్నొ మార్పులొచ్చాయి. ఇందుకు కారణం మనమే అని తెలియకపోవచ్చు. ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి సారించకుండా, మన ప్రవర్తన మార్చుకోనట్లయితే భూమిపై పరిస్థితి మరింత విషమిస్తుంది" -లిల్ డికీ, ర్యాపర్
ఇందులో 32 మంది హాలీవుడ్ నటులు, ప్రముఖులు తమ గాత్రాన్నిచ్చారు. వీడియోలో కనిపించే వివిధ జంతువుల పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. జస్టిన్ బీబర్, అరియానా గ్రాండే, లియోనార్డో డికాప్రియో, కేటీ పెర్రీ లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.