కరోనా కొత్త వేరియంట్లను యాంటీబాడీ కాక్టెయిల్తో కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు భిన్నరకాల యాంటీబాడీలతో కూడిన ఈ మిశ్రమం.. సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. దీన్ని అధిగమించడానికి కృత్రిమంగా రూపొందిన మోనోక్లోనల్ యాంటీబాడీలను రోగులకు ఇస్తున్నారు.
జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్
యాంటీబాడీ కాక్టెయిల్తో కొవిడ్ కొత్త వేరియంట్లను కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. రెండు రకాల యాంటీబాడీలతో కూడిన కొన్ని మిశ్రమాలు అనేక వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది.
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.. ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతిని పొందిన యాంటీబాడీ థెరపీలను విడివిడిగాను, కలిపి మిశ్రమాల రూపంలోనూ పరీక్షించారు. కరోనాతో కొత్తగా వచ్చిన అల్ఫా, బీటా, గామాలతోపాటు భారత్‌లో మొదట వెలుగు చూసిన డెల్టా రకాన్ని పోలిన ఒక వేరియంట్‌పై వాటిని ప్రయోగించారు. రెండు రకాల యాంటీబాడీలతో కూడిన కొన్ని మిశ్రమాలు అనేక వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
ఇదీ చదవండి :Covid Vaccine: 'ప్రపంచానికి 5.5 కోట్ల డోసులిస్తాం'