తెలంగాణ

telangana

ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్-కమలా హారిస్​ల ట్వీట్​ వార్ - కమలా హారిస్ లెటెస్ట్​ న్యూస్​

2020 అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారత సంతతికి చెందిన కమలా హారిస్​ ప్రకటించిన నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ వేదికగా ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి సమాధానంగా హారిస్​ తనదైన శైలిలో స్పందించారు.

TRUMP-KAMALA
డొనాల్డ్​ ట్రంప్-కమలా హారిస్​ల ట్వీట్​ వార్

By

Published : Dec 5, 2019, 5:12 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్​లు ట్విట్టర్​ వేదికగా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు విసురుకున్నారు. 2020 అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు హారిస్​ ప్రకటించడం ఇందుకు కారణమైంది.

అసలేమైందంటే..

55 ఏళ్ల కమలా హారిస్​ డెమెక్రటిక్​ అభ్యర్థిగా 2020 అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇందుకు ఆర్థిక పరిస్థితులు కారణంగా పేర్కొన్నారు.

నాటో సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​ వెల్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ట్విట్టర్​ ద్వారా స్పందించారు.

'చాలా బాధాకరం. మేము మిమ్మల్ని దూరమవుతాము కమలా!' అంటూ ట్వీట్ చేశారు

ట్రంప్​కు దీటుగా బదులిచ్చారు సెనేటర్ కమలా. "బాధ పడకండి ప్రెసిడెంట్.. నేను మిమ్మల్ని..మీ అభిశంసన తీర్మాన విచారణలో కలుస్తాను." అంటూ ట్వీట్ చేశారు.

ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలున్నాయని డెమొక్రాట్లు చెబుతున్నారు. నిరాధార ఆరోపణలని శ్వేతసౌధం వీటిని కొట్టిపారెస్తోంది.

ఇదీ చూడండి:ట్రంప్​ గ్రీన్​సిగ్నల్​.. తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధం..!

ABOUT THE AUTHOR

...view details