తెలంగాణ

telangana

ETV Bharat / international

దివ్యాంగుల కార్నివాల్​ - పోర్టెలా సాంబ పాఠశాల

ప్రపంచ ప్రఖ్యాత రియో డి జనీరో కార్నివాల్​లో దివ్యాంగులైన చిన్నారులు సాంబ సంగీతంతో ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు.

దివ్యాంగుల కార్నివాల్​

By

Published : Mar 3, 2019, 2:42 PM IST

దివ్యాంగుల కార్నివాల్​

బ్రెజిల్​లోని రియో డి జనీరో నగరంలో ప్రపంచ ప్రఖ్యాత కార్నివాల్​ సందడిగా సాగుతోంది. ఈసారి 16 పాఠశాలలకు చెందిన చిన్నారులు ఇందులో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

బ్రెజిల్​ ప్రఖ్యాత సంగీతం...​ సాంబ. ఈ దేశంలో దీన్ని నేర్పేందుకు అనేక పాఠశాలలున్నాయి. వీటిలో ఒకటి పోర్టెలా సాంబ పాఠశాల. ఆటిజంతో ఇబ్బందిపడే హెండ్రిక్​ మాతోస్ ఇక్కడ​ ట్రైనర్.

చిన్నప్పటి నుంచే సాంబ పరేడ్​లను టీవీలో చూసేవాడు మాతోస్​. మొదటిసారి 17 ఏళ్ల వయస్సులో సాంబ శిక్షకుడు అవ్వాలని అనుకున్నాడు. ఈ నిర్ణయాన్ని తల్లికి చెప్పగా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం చాలా కష్టంగా మాట్లాడే మాతోస్​... సాంబ సంగీతంతోనూ మాట్లాడుకోవచ్చని అంటుంటాడు.

అతడికి పరిధులు ఉన్నాయి. కానీ... సంగీతంలో అలాంటివి ఏవీ లేవు. అందుకే నేను గర్వంగా ఉన్నాను. తన హృదయం నుంచి సంగీతం​ వస్తుంది. ఏదైనా సంగీత పరికరం తన వద్ద ఉంచినట్లయితే... ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న కొద్దిసేపటికే వాయించటం ప్రారంభిస్తాడు. సంగీతంతోనే పుట్టాడు. అతని పట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను. - రోసినియా, హెండ్రిక్​ మాతోస్​ తల్లి

నాలుగు సంవత్సరాల క్రితం పోర్టెలా పాఠశాలలో డ్రమ్స్​ వాయించటం ప్రారంభించాడు హెండ్రిక్. గత సంవత్సరం సాంబ ఆఫ్​ ఇన్​క్లూజన్​ అనే పాట రాసి, పోర్టెలా పాఠశాల అధికారులకు చూపించారు. ఈ పాట వారికి ఎంతో బాగా నచ్చింది. ఆయనకు ప్రమోషన్​ ఇచ్చారు.

మొదటిసారిగా పొర్టెలా పాఠశాల విద్యార్థులు రియో డి జనీరో కార్నివాల్​లో పాల్గొననున్నారు. నృత్యాలు, పాటలతో ఆకట్టుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details