ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా నిలబడే డెమోక్రాట్ అభ్యర్థిపై ఈ మంగళవారం తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశంలోని 50 రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్చి 3న 14 రాష్ట్రాల్లో లక్షలమంది అమెరికన్లు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. డెమోక్రాట్ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు బెర్నీ సాండర్స్, జో బిడెన్, మైఖెల్ బ్లూమ్‌బర్గ్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మంగళవారమే ప్రజలకు, నాయకులకు కీలకం కానుంది.
ఒకవేళ అన్ని అడ్డంకులను ఎదుర్కొని నిలబడితే ఎలిజబెత్ వైరస్, అమీ కోబుచార్లకు కూడా డెమోక్రాట్ తరఫున అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ ముగిశాక.. ఓట్లను లెక్కించేందుకు రాత్రంతా పట్టొచ్చని అధికారులు తెలిపారు.