తెలంగాణ

telangana

దొంగను పట్టుకోవడానికి వెళితే జింక దొరికింది..!

By

Published : Jun 8, 2019, 7:37 AM IST

Updated : Jun 8, 2019, 8:32 AM IST

అమెరికా టెక్సాస్​ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. దొంగను పట్టుకోవడానికి తుపాకులతో ఓ ఇంటికి వెళ్లిన పోలీసులు.. గంటపాటు శ్రమించి చివరికి నిరుత్సాహంగా బయటకు వచ్చారు. కారణం ఏంటంటారా.. అయితే ఈ కథ చదవాల్సిందే.

దొంగను పట్టుకోవడానికి వెళితే జింక దొరికింది..!

దొంగను పట్టుకోవడానికి వెళితే జింక దొరికింది..!

అమెరికాలో ఈ మధ్య కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి వాటిపై సమాచారం అందిన నిమిషాల్లో అక్కడి పోలీసులు స్పందిస్తుంటారు. అయితే టెక్సాస్​లో జరిగిన ఓ ఘటన పోలీసులకు వింత అనుభవాన్నిచ్చింది.

'ఇంట్లో దొంగ దూరాడు.. నా ఆయుధాన్ని వంటింట్లోనే మర్చిపోయాను' అంటూ ఓ మహిళ భయంతో టెక్సాస్​లోని పోలీస్​ స్టేషన్​కు ఫోన్​ చేశారు. వెనువెంటనే అప్రమత్తమైన అధికారులు క్షణాల్లో తుపాకులతో ఆ మహిళ ఇంటిని చుట్టుముట్టారు.

దొంగను బయటకు రావాలంటూ హెచ్చరించారు. ఎంతసేపటికి రాకపోవడం వల్ల నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించారు. ఇల్లు అంతా చిందరవందరగా ఉంది. తుపాకులను ఎక్కుపెట్టి పోలీసులు నిశితంగా ప్రతి అంగుళం పరిశీలించారు.

దొంగ కోసం చూసిన పోలీసులకు... అక్కడ ఓ జింక కంటపడింది. ఎక్కడి నుంచో ఇంట్లోకి ప్రవేశించిన ఆ లేడి.. బయటకు వెళ్లే దారి తెలియక అటు ఇటూ తికమకగా తిరుగుతోంది. ఇంకేముంది.. ఆశ్చర్యంతో నిల్చొన్న పోలీసులు జింకకు దారిచ్చి వెనుదిరిగారు.

ఈ మొత్తం ఘటన అధికారుల బాడీ కెమెరాలో రికార్డయింది.

ఇదీ చూడండి:అంతరిక్షంలోకి పర్యటకులు.. నాసా కొత్త ఆలోచన

Last Updated : Jun 8, 2019, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details