అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో చెలరేగిన జాత్యహంకార వ్యతిరేక నిరనసల్లో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో నల్లజాతీయులకు విముక్తి లభించిన రోజు 'జూనెటీన్త్' సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్లో భాగంగా.. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో కాన్ఫెడరేట్ జనరల్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
వాషింగ్టన్లో ఉన్న 11 అడుగుల ఎత్తైన కాన్ఫెడెరేట్ జనరల్ ఆల్బర్ట్ పైక్ విగ్రహాన్ని గొలుసులతో లాగి చెత్తకుప్పల్లో పడేశారు. అనంతరం నిప్పుపెట్టి దాని చుట్టు వలయాకారంలో నిలుబడి నినాదాలు చేశారు. 'న్యాయం లేకపోతే.. శాంతి లేదు', 'జాత్యహంకార పోలీసులు వద్దు' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా.. విగ్రహ ధ్వంసాన్ని ఆపకుండా మిన్నుకుండిపోయారు. ఈ దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన అధ్యక్షుడు ట్రంప్.. పోలీసులు ఉన్నా ఎందుకు ఆపలేకపోయారు.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నగర మేయర్‌కు లేఖ రాశారు.
స్కాట్ కీ విగ్రహం..