తెలంగాణ

telangana

ETV Bharat / international

11 మందిపై గవర్నర్​ అత్యాచారం! అభిశంసన తప్పదా? - న్యూయార్క్​ గవర్నర్​

తన వద్ద పని చేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిన క్రమంలో న్యూయార్క్​ గవర్నర్​ ఆండ్రూ క్యూమో రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. 11​ మంది మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని 165 పేజీల నివేదిక సమర్పించింది దర్యాప్తు బృందం. దీంతో అధ్యక్షుడు జో బైడెన్​ సహా పలువురు డెమొక్రాట్లు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

Cuomo urged to resign
గవర్నర్​పై లైంగిక వేధింపుల ఆరోపణలు

By

Published : Aug 4, 2021, 2:09 PM IST

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్​ గవర్నర్​ ఆండ్రూ క్యూమో రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. 11​ మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తనపై ఆరోపణలు చేసిన ఓ మహిళను భయపెట్టేందుకు ప్రయత్నించారని దర్యాప్తులో తేలిన క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్​ సహా పలువురు డెమొక్రటిక్​ నేతలు గవర్నర్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

'ఆయన తప్పకుండా రాజీనామా చేయాలి' అని మీడియాతో అన్నారు జో బైడెన్​. స్పీకర్​ నాన్సీ పెలోసీ, న్యూయార్క్​​ సెనేటర్​ చుక్​ చుమెర్​, కిర్​స్టేన్​ గిలిబ్రాండ్​ సహా డెమొక్రాట్ల నుంచి సైతం అదే డిమాండ్​ ప్రతిధ్వనిస్తోంది. క్యూమో ఎంతోకాలం పదవిలో కొనసాగబోరని స్పష్టంగా తెలుస్తోందని న్యూయార్క్​ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ కార్లే హీస్టీ తెలిపారు. వీలైనంత త్వరగా అభిశంసన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

న్యూయార్క్​ గవర్నర్​ ఆండ్రూ క్యూమో

ఐదు నెలల పాటు విచారణ..

గవర్నర్​ క్యూమోపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సుమారు ఐదు నెలల పాటు దర్యాప్తు చేపట్టారు. న్యూయార్క్​ అటార్నీ జనరల్​ నేతృత్వంలో మరో ఇద్దరు న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సాగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని, బయటి విభాగాలకు చెందిన సుమారు 11 మంది మహిళలు క్యూమోపై ఆరోపణలు చేసినట్లు తేల్చారు. అనుచితంగా ప్రవర్తిస్తూ తమను తాకారని, తమ శరీర ఆకృతిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసేవారని చెప్పినట్లు వెల్లడించారు. గరవర్నర్​తో పాటు 179 మందిని ప్రశ్నించినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.

'ఆధారాలు, పలువురు ఇచ్చిన వాంగ్మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గవర్నర్​ క్యూమో.. రాష్ట్రంలోని ప్రస్తుత, మాజీ ఉద్యోగులపై ఫెడరల్​, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. క్యూమోపై ఫిర్యాదు చేస్తే తమపై ప్రతీకార దాడులకు పాల్పడతారేమోననే భయంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆయన కార్యాలయం ఒక భయకరమైన పని ప్రదేశం. ' అని న్యూయార్క్​ అటార్నీ జనరల్​ లెటిటియా జేమ్స్ తెలిపారు.

దర్యాప్తు బృందం క్యూమోపై 165 పేజీల నివేదికను సమర్పించింది. దాంతో ఆయన రాజీనామాకు డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఏడాది క్రితం కొవిడ్​-19 మహమ్మారిని కట్టడి చేయటంలో మంచి పనితీరు కనబరిచారని క్యూమో ప్రశంసలు అందుకోవటం గమనార్హం.

ఖండించిన క్యూమో..

తనపై వచ్చిన ఆరోపణలు గవర్నర్​ క్యూమో ఖండించారు. 'వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎవరినీ, ఎప్పుడూ అనుచితంగా తాకలేదు. లైంగికంగా వేధించలేదు.' అని పేర్కొన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ స్పీకర్​ హీస్టీతో క్యూమో ఫోన్​ మాట్లాడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తాను ఆఫీస్​ను వదలాలనుకోవట్లలేదని, డెమొక్రాట్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు స్పీకర్​కు తెలిపారని చెప్పారు. అభిశంసనను ఎదుర్కొనేందుకు కావాల్సిన మద్దతు ఉందని చెప్పారన్నారు.

ఇదీ చూడండి:మళ్లీ లక్షకుపైగా కేసులు- గవర్నర్లకు బైడెన్ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details