తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయా?

కరోనాతో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందే వారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఈ అధ్యయన వివరాలను హార్ట్​ రిథమ్​ జర్నల్​లో ప్రచురించారు.

Critically ill COVID-19 patients 10 times more likely to develop heart rhythm disorders: Study
కరోనా వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయా?

By

Published : Jun 23, 2020, 12:49 PM IST

కరోనా వైరస్‌ బారినపడి ఐసీయూలో చికిత్స పొందే వారిలో సాధారణం కంటే 10 రెట్లు అధికంగా గుండె సమస్యలు వచ్చే అవకాశమున్నట్లు తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 7వందల మందిని పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు పరిశోధనా విషయాల్ని హార్ట్‌ రిథమ్‌ జర్నల్‌లో ప్రచురించారు.

ప్రయోగంలో పాల్గొన్న వారి సగటు వయస్సు 50 ఏళ్లుగా ఉండగా... బాధితుల్లో ప్రారంభ దశతో పోల్చితే... రానురాను హృదయ స్పందనల్లో చాలా వ్యత్యాసం కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నవారిలో దాదాపు 44 శాతం మందికి తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. గుండె లయలు, క్రమరహిత స్పందనల్ని కనుగొన్నారు. ఇటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల రోగులకు మెరగైన చికిత్స అందించేందుకు వీలవుతుందని ఈ సమస్యలు కొవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక ఆనారోగ్యానికి దారి తీస్తాయో లేదో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:భారత్​, చైనా, రష్యా త్రైపాక్షిక భేటీ- కీలకాంశాలపై చర్చ

ABOUT THE AUTHOR

...view details