Covid Vaccination For Children: కొవిడ్-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. వైరస్‌ను నిరోధించడంలో ఈ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారులకూ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని పలు దేశాలు మొదలుపెట్టాయి. దీంతో అసలు చిన్నారులకు కొవిడ్ టీకాలు సురక్షితమేనా అనే అనుమానాలు, భయాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్‌లు అత్యంత సురక్షితమేనని అమెరికాలో వాస్తవ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Children Covid Vaccine News:
అమెరికాలో 12 నుంచి 17ఏళ్ల మధ్య వయసున్న లక్షల మంది పిల్లలకు ఇప్పటికే ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వీరితోపాటు 5 నుంచి 11ఏళ్ల చిన్నారులకు ఈ నవంబర్ నుంచే ఫైజర్ పంపిణీని మొదలుపెట్టారు. ఇప్పటికే 50లక్షల మందికి తొలిడోసును అందించారు. ఇప్పటివరకు వారిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని వ్యాక్సిన్‌లపై అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణ విభాగం స్పష్టం చేసింది. 12ఏళ్ల వయసువారికి సాధారణ డోసు ఇస్తుండగా.. ఐదేళ్ల వయసు పైబడిన వారికి మాత్రం పెద్దవారితో పోలిస్తే స్వల్ప మోతాదులోనే అందిస్తున్నారు. ఇలా 3100 వ్యాక్సిన్ తీసుకున్న వారి సమాచారాన్ని అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) విశ్లేషించింది. చిన్నారుల్లో కొవిడ్-19ను నిరోధించడంలో వ్యాక్సిన్ 91శాతం సమర్థత చూపిస్తోందని వెల్లడించింది. ముఖ్యంగా యువకుల మాదిరిగానే చిన్నారుల్లోనూ కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించింది. తద్వారా చిన్నారులకు కొవిడ్ టీకాలు సురక్షితమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
దుష్ప్రభావాలు స్వల్పమే..