ప్రపంచవ్యాప్తంగా ఆందోళకర స్థాయిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 2కోట్ల 70లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. శనివారం ఒక్కరోజే 2లక్షల 69వేల మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొత్తగా 4,822 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 8.83 లక్షలకు పెరిగింది.
మహమ్మారి సోకిన వారిలో ఇప్పటివరకు 1.91కోట్ల మంది కోలుకున్నారు. మరో 70 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- మొత్తం కేసులు : 27,054,164
- మొత్తం మరణాలు : 883,176
- యాక్టివ్ కేసులు : 7,015,051
- రికవరీలు : 19,155,937
- అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 42,095 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 64,31,152కు పెరిగింది. మరో 707 మంది వైరస్ కారణంగా మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,92,818కు చేరింది.
- బ్రెజిల్లో తాజాగా 31,199 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. బాధితుల సంఖ్య 41,23,000లకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 646మంది బలవ్వగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,26,230కు పెరిగింది.