తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్​

చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్​ను తేలిగ్గా తీసుకోబోమని చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అనంతరమే అకస్మాత్తుగా వైరస్ విజృంభించిందన్నారు. అటు చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్​పై రిపబ్లికన్లు ఒత్తిడి తెస్తున్నారు.

Coronavirus came from China, US is not going to take it lightly
'చైనాలో ఉద్భవించిన వైరస్​ను తేలిగ్గా తీసుకోం'

By

Published : May 22, 2020, 9:50 AM IST

చైనాపై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఆ దేశం నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్​ను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. మిచిగాన్​లో ఆఫ్రికన్​-అమెరికన్​ నేతలతో సెషన్​ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

" కరోనా చైనా నుంచి వచ్చింది. మేం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజుల్లోనే అకస్మాత్తుగా వైరస్​ విజృంభించింది. మేం దానిని తేలిగ్గా తీసుకోం "

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో చైనా పూర్తిగా విఫలమైందని గత కొద్ది వారాలుగా ఆరోపిస్తూనే ఉన్నారు ట్రంప్. ఈ మమహ్మారి ధాటికి అమెరికాలో 94 వేల మందికి పైగా మరణించారు. 16 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. ఈ పరిస్థితికి కారణమైన చైనాపై తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని ట్రంప్​ హెచ్చరిస్తూనే ఉన్నారు.

చైనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు ట్రంప్. అందుకే ఆయన పరిపాలనా విభాగంపై రిపబ్లికన్ చట్టసభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని చైనా అపహరించడానికి గానీ, తెలుసుకోవడానికి గానీ వీల్లేకుండా 'కొవిడ్​-19 వ్యాక్సిన్ ప్రొటెక్షన్ యాక్ట్' బిల్లును గురువారం ప్రవేశపెట్టారు సెనేటర్లు రిక్ స్కాట్​, మైక్​ బ్రౌన్​, మార్ష బ్లాక్​బర్న్​, జోని ఎర్న్స్​, మెక్​సాలీ, టామ్​ కాటన్.

కొవిడ్​-19 పరిశోధన కార్యకలాపాల్లో ఉన్న చైనీస్ విద్యార్థులపై నిఘా ఉంచేలా అమెరికా హోంశాఖ, ఎఫ్​బీఐలు ఈ బిల్లుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.

కరోనా వైరస్​ వ్యాప్తి విషయాన్ని కప్పిపుచ్చి, అమెరికా మేధో సంపత్తిని అపహరిస్తున్న చైనాపై ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టెడ్​ క్రూజ్​ తెలిపారు. వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన విషయాలు బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details