తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా, బ్రెజిల్​లో ఆగని కరోనా ఉద్ధృతి - కరోనా వ్యాప్తి

ప్రపంచదేశాలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు 2.84లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. సుమారు 7వేల మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 2.61 కోట్లు దాటగా.. మృతుల సంఖ్య 8లక్షల 67వేలకు మించింది.

CORONA GLOBAL TRACKER
ప్రపంచంపై కరోనా పంజా: కొత్తగా 2.84లక్షల మందికిపైగా వైరస్​

By

Published : Sep 3, 2020, 9:14 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,84,725 పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 6,994 మంది వైరస్​ కారణంగా మరణించారు.

కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. బ్రెజిల్​, భారత్​, రష్యా వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే అతి త్వరలోనే భారత్​.. బ్రెజిల్​ను అధిగమించి రెండో స్థానానికి చేరుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • మొత్తం కేసులు : 2,61,76,140
  • మొత్తం మరణాలు : 8,67,295
  • యాక్టివ్ కేసులు : 68,67,389
  • రికవరీలు : 1,84,41,456
  1. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 41,211 మందికి కొవిడ్​ సోకినట్లు తేలింది. మరో 1,090 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 62.90 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య లక్షా 90 వేలకు చేరువైంది.
  2. బ్రెజిల్​లో కొత్తగా 41,889 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, 1,218 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఆ దేశంలో బాధితుల సంఖ్య 40 లక్షలు దాటింది.
  3. రష్యాలో తాజాగా 4,952 కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య10 లక్షలు దాటింది.
  4. మెక్సికోలో కొవిడ్​ విజృంభిస్తోంది. కొత్తగా 6వేల మందికి కరోనా సోకగా, కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. మరో 827 మంది కరోనాతో మృతిచెందగా.. మరణాల సంఖ్య 65,241కు చేరింది.
  5. స్పెయిన్​లో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా 8,581 కొత్త కేసులు నమోదుకాగా.. బాధితుల సంఖ్య 4.79 లక్షలు దాటింది.
  6. అర్జెంటీనాలోనూ కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులోనే 10వేలకుపైగా కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 4 లక్షల 39 వేలు దాటింది.

ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోందిలా..

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 62,90,737 1,89,964
బ్రెజిల్​ 40,01,422 1,23,899
రష్యా 10,05,000 17,414
పెరూ 6,63,437 29,259
కొలంబియా 6,33,339 20,348
దక్షిణాఫ్రికా 6,30,595 14,389
మెక్సికో 6,06,036 65,241
స్పెయిన్​ 4,79,554 29,194

ఇదీ చదవండి:ఆరు వారాల్లో ఆక్స్​ఫర్డ్ కరోనా వ్యాక్సిన్​!

ABOUT THE AUTHOR

...view details