తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి - covid 19 affect

ఇంతవరకూ చైనాను వణికించిన కరోనా వైరస్ ... ఇప్పుడు ఇటలీ, స్పెయిన్‌లో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఇటలీలో 3,500 కేసులు, స్పెయిన్‌లో 1500 కేసులు నమోదయ్యాయి. యూరప్ దేశాల నుంచి ఎవరూ రాకుండా నిషేధం విధించిన అమెరికా ... యూకే, ఐర్లాండ్‌లను ఆ జాబితాలోకి చేర్చింది.

Corona epidemic affecting the world
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి

By

Published : Mar 15, 2020, 5:50 AM IST

Updated : Mar 15, 2020, 7:48 AM IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. సుమారు 150 దేశాలకు వ్యాపించిన వైరస్‌, దాదాపు 5వేల 800 మందిని బలితీసుకుంది. మొత్తం లక్షా 55 వేల మందికి పైగా మహమ్మారి బారినపడగా, దాదాపు 80 వేల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.

చైనాలో తగ్గుముఖం పడుతున్న రోగం ఇటలీలో ప్రమాదకరంగా తయారైంది. శనివారం ఒక్కరోజే 3,497 కేసులు నమోదు కాగా.... మొత్తం కేసులు 21,157కు చేరినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో 2‌0శాతం కేసులు పెరిగినట్లు ఇటలీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 175 మంది ప్రాణాలు కోల్పోగా, మరణించిన వారిసంఖ్య 1,441కి చేరింది.

ఫెరారీ మూసివేత

ప్రముఖ కార్ల తయారీసంస్థ ఫెరారీ, ఇటలీలోని రెండు ప్లాంట్లను 2 వారాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. స్పెయిన్‌లోనూ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. 24గంటల వ్యవధిలో 1500 కొత్తకేసులు నమోదుకాగా, మొత్తం కేసులు 5,753కు చేరినట్లు అధికారులు తెలిపారు. శనివారం 62మంది చనిపోగా, ఇప్పటివరకూ 195మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించిన స్పెయిన్ ప్రభుత్వం... బార్లు, రెస్టారెంట్లు మూసివేసింది. దేశ వ్యాప్తంగా ఆంక్షలు విధించింది.

ఇరాన్‌లో ఒక్కరోజే 97మంది చనిపోగా, మృతుల సంఖ్య 611కు చేరింది. అమెరికాలో చనిపోయినవారి సంఖ్య 55కు చేరింది. యూరోప్ దేశాల నుంచి ఎవరూ రాకుండా నిషేధం విధించిన అగ్రరాజ్యం... తాజాగా యూకే, ఐర్లాండ్‌లను సైతం ఆ జాబితాలోకి చేర్చింది.

బీభత్సం

ఈక్వెడార్, డెన్మార్క్‌లో తొలి మరణాలు సంభవించగా... ఉరుగ్వే, నమీబియా, రువాండా, ప్యూర్టెరికో తదితర దేశాలకు సైతం వైరస్ వ్యాపించింది. కరోనా కారణంగా సిరియా పార్లమెంట్ ఎన్నికలు వాయిదాపడ్డాయి. లిథువేనియా తమ సరిహద్దులను మూసివేసింది.

ఇజ్రాయెల్‌లో దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, వ్యాయామశాలలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ సోకిన ఇండోనేషియా రవాణా మంత్రి పరిస్థితి విషమించినందున ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్వీయ నిర్భంధంలో ఉండకుండా నిబంధనలు ఉల్లఘించారన్న కారణంతో కొలంబియా ఇద్దరు ఫ్రాన్స్‌ దేశస్థులను బహిష్కరించింది.

ఆసియాలో ఇప్పటివరకూ 3 వేల 303 మంది ప్రాణాలు కోల్పోగా, యూరప్‌లో 1,771మంది చనిపోయారు. పశ్చిమాసియాలో 623 మందిని బలి తీసుకున్న కరోనా.. అమెరికా, కెనడాలలో 62 మందిని పొట్టనబెట్టుకుంది.

ఇదీ చూడండి:లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు...

Last Updated : Mar 15, 2020, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details