తెలంగాణ

telangana

ETV Bharat / international

విస్కాన్సిన్​లో​ రీకౌంటింగ్​ పూర్తి.. బైడెన్​దే విజయం - జో బైడెన్​ గెలుపు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి నెలరోజులు కావస్తున్నా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విస్కాన్సిన్​ రాష్ట్రంలోని రెండు కౌంటీల్లో చేపట్టిన రీకౌంటింగ్​ ఫలితాల్లో జో బైడెన్​ విజయం సాధించారు. డేన్​ కౌంటీలో ఈసారి అధ్యక్షుడు ట్రంప్​కు 45 ఓట్లు పెరిగాయి. మిల్వాకీలో బైడెన్​కు 132 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బైడెన్​ విజయాన్ని నిర్ధరించటానికి మాత్రమే రీకౌంటింగ్​ ఉపయోగపడిందని డెమొక్రటిక్​ నేతలు పేర్కొన్నారు.

Biden's win over Trump
జో బైడెన్​

By

Published : Nov 30, 2020, 5:08 AM IST

విస్కాన్సిన్​ రాష్ట్రంలోని రెండు కౌంటీల్లో చేపట్టిన రీకౌంటింగ్​ ఆదివారం పూర్తయింది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రటిక్​ అభ్యర్థి విజయాన్ని రీకౌంటింగ్​ ఫలితాలు నిర్ధరించాయి. ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధాని మాడిసన్​తో కూడిన డేన్​ కౌంటీలో నిర్వహించిన రీకౌంటింగ్​లోని మొత్తం ఓట్లలో చిన్న మార్పులు ఉన్నట్లు పేర్కొన్నారు అధికారులు. డేన్​ కౌంటీలో ఈసారి ట్రంప్​కు 45 ఓట్లు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. మరోవైపు.. మిల్వాకీ కౌంటీలో గతంలోని ఫలితాలే ప్రతిబింబించినట్లు చెప్పారు. మిల్వాకీలో బైడెన్​కు 132 ఓట్లు అధికంగా వచ్చయన్నారు.

డెమొక్రటిక్​ అభ్యర్థి జోబైడెన్​ సుమారు 20,600 ఓట్ల మెజారిటీతో ట్రంప్​పై విజయం సాధించారు. మిల్వాకీ, డేన్​ కౌంటీల్లో ఇరువురి మధ్య మార్జిన్​ 2 టూ 1 గా ఉంది.

" మేం చెప్పినట్లుగానే విస్కాన్సిన్​లో జో బైడెన్​ విజయాన్ని నిర్ధరించటానికి మాత్రమే ఈ రీకౌంటింగ్​ ఉపయోగపడింది" అని పేర్కొన్నారు బైడెన్​ మద్దతుదారు డానియల్​ మెల్ఫీ. అయితే.. ఈ రీకౌంటింగ్​ ఫలితాలపై ట్రంప్​ బృందం స్పందించలేదు. దీనిపై అధ్యక్షుడు తదిపరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

మంగళవారం తుది గడువు..

ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు మంగళవారం నాటికే గడువు ఉన్నందున అధ్యక్షుడు ట్రంప్​ బృందం త్వరితగతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఫలితాలను విస్కాన్సిన్​ ఎన్నికల సంఘం డెమొక్రటిక్​ అధికారి ధ్రువీకరిస్తారు. అయితే.. ఫలితాల నిర్ధరణను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేశారు విస్కాన్సిన్​ ఓటర్ల సంఘం సభ్యులు.

ఇదీ చూడండి:'బైడెన్​ నంబర్​ వన్​ అధ్యక్షుడు అవుతారు'

ABOUT THE AUTHOR

...view details