తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఏదో ఒక రోజు అమెరికాపై చైనా అణుదాడి- ఇప్పటికే ఆ ప్రయోగం!'

అమెరికాపై చైనా ఏదో ఒక రోజు అనూహ్యంగా అణు దాడికి పాల్పడే సామర్థ్యం(us china missile) కలిగి ఉంటుందని అగ్రరాజ్యం సైన్యాధికారి హెచ్చరించారు. ఈ ఏడాది జులైలో చైనా హైపర్​సోనిక్​ క్షిపణి.. ప్రపంచాన్ని చుట్టిందని తెలిపారు(China hypersonic missile). ఈ ఆయుధం ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగలదని వివరించారు.

China's hypersonic missile 'went around the world' in July: top US military official
'ఏదో ఒక రోజు అమెరికాపై చైనా అణుదాడి'

By

Published : Nov 19, 2021, 5:53 PM IST

Updated : Nov 19, 2021, 6:45 PM IST

ఏదో ఒకరోజు అమెరికాపై అణుదాడికి పాల్పడే(us china missile) శక్తిమంతమైన దేశంగా చైనా అవతరిస్తుందని అగ్రరాజ్యం ఉన్నత సైన్యాధికారి జనరల్​ జాన్​ హైటెన్ హెచ్చరించారు. ఈ ఏడాది జులై 27న చైనా ప్రయోగించిన హైపర్​సోనిక్ క్షిపణిపై మరిన్ని వివరాలు(China hypersonic missile) తెలిశాక ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధ్వనికంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ క్షిపణి ప్రపంచాన్ని చుట్టివచ్చినట్లు తెలిపారు.

'చైనా ప్రయోగించిన హైపర్​సోనిక్​ గ్లైడ్​ వాహనం ప్రపంచ దేశాలను చుట్టి తిరిగి చైనాకే వెళ్లింది. నిర్దేశించిన లక్ష్యానికి అత్యంత చేరువగా వెళ్లింది. ఇది తొలిసారి ఉపయోగిస్తున్న ఆయుధంలా కనిపిస్తోంది. చైనా గత ఐదేళ్లలో వందల సంఖ్యలో హైపర్​సోనిక్ పరీక్షలు చేపట్టింది. అమెరికా కేవలం తొమ్మిది హైపర్​సోనిక్ ప్రయోగాలకే పరిమితమైంది. చైనా ఇప్పటికే మధ్యశ్రేణి హైపర్​సోనిక్ ఆయుధాన్ని వినియోగిస్తోంది. అమెరికాకు ఇంకా కొన్నేళ్లు పడుతుంది. '

-జాన్​ హైటెన్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్​ స్టాఫ్ వైస్ ఛైర్మన్

ఇదే తొలిసారి..

చైనా ప్రయోగించిన హైపర్​సోనిక్​ ఆయుధం(China hypersonic missile test) లక్ష్యాన్ని కొద్ది కిలోమీటర్ల దూరంలో మిస్​ అయినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. హైపర్​సోనిక్ క్షిపణి ఇలా భూమి చుట్టూ తిరిగివచ్చేలా ఓ దేశం ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి అని పేర్కొంది. హైపర్​సోనిక్ అయుధాలకు ధ్వనికంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది. అందువల్ల వాటిని రాడార్లు కూడా పసిగట్టలేవు.

అయితే తాము ప్రయోగం చేపట్టిన విషయం(China hypersonic missile news) నిజమేనని చైనా అక్టోబర్​ 18న అంగీకరించింది. కానీ అది కేవలం పునర్వినియోగ అంతరిక్ష నౌక అని బుకాయించింది. అది క్షిపణి కాదని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇది సాధారణ ప్రయోగమేనని, ప్రపంచంలోని చాలా కంపెనీలు ఈ తరహా పరీక్షలను(China hypersonic missile) చేపట్టాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ వివరించారు. అంతరిక్ష వినియోగం మానవుల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగేందుకు తాము ఏ దేశంతోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పారు.

చైనా అణ్వాయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోందని ఈ నెల మొదట్లో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​ నివేదిక విడుదల చేసింది(us china news). ఈ దశాబ్దం చివరి నాటికి చైనా అణ్వస్త్రాల సంఖ్య 1000 దాటుతుందని హెచ్చరించింది.

తమ సైన్యానికి చైనానే అతిపెద్ద సవాల్​ అని అమెరికా రక్షణమంత్రి లాయ్డ్ ఆస్టిన్​ పదే పదే చెబుతున్నారు(us china news latest). హైపర్‌సోనిక్ ఆయుధాల వంటి ఒక నిర్దిష్ట సామర్థ్యానికి బదులుగా ఇతర సామర్థ్యాలపైనా అమెరికా దృష్టి సారించిందని బుధవారం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'భారత్​తో ఎందుకలా వ్యవహరిస్తోందో చైనానే చెప్పాలి'

భారత్‌పై అమెరికా కాట్సా అస్త్రం..!

Last Updated : Nov 19, 2021, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details