తెలంగాణ

telangana

ETV Bharat / international

వాణిజ్య యుద్ధం: అమెరికాకు చైనా హెచ్చరికలు - వాణిజ్య యుద్ధం

ఇటీవలే చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలను విధించారు ట్రంప్​. ఈ విషయంపై స్పందించిన డ్రాగన్​ దేశం.. అగ్రరాజ్యం సుంకాల పెంపును ప్రతిఘటిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికీ అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నమని పేర్కొంది.

వాణిజ్య యుద్ధం

By

Published : Aug 3, 2019, 5:46 AM IST

చైనాపై అమెరికా విధించిన సుంకాల పెంపుపై ఆ దేశం తీవ్రంగా మండిపడింది. అగ్రరాజ్యం ఇదే రీతిలో ప్రవర్తిస్తే చైనా తప్పకుండా ప్రతిఘటిస్తుందని హెచ్చరించింది. చైనా దిగుమతులపై మరో 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో డ్రాగన్​ దేశం ఈ వ్యాఖ్యలు చేసింది.

"అమెరికా చర్యలను చైనా వ్యతిరేకిస్తోంది. సుంకాలు పెరిగితే ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా సుంకాలు పెంచితే.. చైనా తప్పని సరిగా ప్రతి చర్యలు తీసుకుంటుంది."- హువా చుయింగ్, చైనా విదేశాంగ ప్రతినిధి.

అయితే అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయాన్ని చుయింగ్ వెల్లడించలేదు.

మాటకు మాటా... యుద్ధానికి యుద్ధం

ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలపై చైనా నూతన ఐరాస రాయబారి జాంగ్​ జున్​ స్పందించారు. సమస్య పరిష్కరించడం కోసం అగ్రరాజ్యంతో చర్చలు జరపడానికి చైనా సిద్ధంగా ఉన్నట్టు ఉద్ఘాటించారు. ఒకవేళ అమెరికా వాణిజ్య యుద్ధమే కోరుకుంటే... తామూ సిద్ధమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారత్​-పాక్​ కోరితేనే కశ్మీర్​పై జోక్యం: ట్రంప్

ABOUT THE AUTHOR

...view details