2020 ఎన్నికల్లో తన ఒటమిని చైనా, ఇరాన్ సహా పలు దేశాలు కోరుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా విజయం సాధించినవారితో మైత్రి పెంచుకోవడానికి చైనా కలలు కంటోందన్నారు. అదే జరిగితే అగ్రరాజ్యం ఎన్నడూ లేని విధంగా ధ్వంసమవుతుందని... కానీ తాను అలా జరగనివ్వనని ట్రంప్ ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లోనూ తానే విజయం సాధిస్తానని అమెరికా అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు.
2018 సెప్టెంబర్లో ఐక్య రాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించినప్పుడూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను అమెరికా అధ్యక్షుడి బాధ్యతలను రెండోసారి చేపట్టడం చైనాకు ఇష్టం లేదన్నారు. దేశ ప్రజల్లో తనపై వ్యతిరేకతను పెంచుతోందని ఆరోపణలు చేశారు.