Isolation quarantine covid CDC: ఐసొలేషన్, క్వారంటైన్ నిబంధనల్లో అమెరికా సీడీసీ(వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం) కీలక మార్పులు చేసింది.
వైరస్ నిర్ధరణకు ముందు రెండు రోజులు, తర్వాత మూడు రోజుల్లోనే తీవ్రత అధికంగా ఉంటోందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌తో ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కేసులు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నా.. వ్యాప్తి వేగంగా ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో ఆరోగ్య వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండేందుకు సీడీఎస్ నిబంధనల్లో మార్పులు చేసింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల ఐసొలేషన్ సమయాన్ని ఇప్పటికే కుదించారు. గతంలో ఉన్న రూల్స్ కన్నా తక్కువ రోజుల్లోనే కొవిడ్ సోకిన వారు విధుల్లో చేరుతున్నారు.
ఐసొలేషన్ అంటే? కొత్త నిబంధనలేంటి?
కొవిడ్ సోకిన వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. టీకాలు తొలి డోసు తీసుకున్న వారికి అసలు టీకాలే తీసుకోని వారికి, బూస్టర్ డోసు తీసుకున్న ప్రజలకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం..
- ఐసొలేషన్ అనేది కొవిడ్ పాజిటివ్‌గా తేలిన రోజు నుంచి మొదలవుతుంది.
- కొవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తి.. 5 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలి. గతంలో ఇది 10రోజులు.
- ఐదు రోజుల తర్వాత.. లక్షణాలు ఇంకా ఉంటే ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత ఐదు రోజులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
క్వారంటైన్ నిబంధనలేంటి?