ఆ దేశంలో మానవ పుర్రెలను ఇంట్లో అత్యంత భద్రంగా దాచుకుంటారు. ఆ పుర్రెలో మరణించిన తమ వారి ఆత్మ ఉంటుందని భావిస్తారు. తమ కష్టాలను కపాలానికి మొర పెట్టుకుని.. మంచి జరగాలని వేడుకుంటారు. ఏడాదికోసారి పుర్రెలను అందంగా అలంకరించి పండుగ చేసుకుంటారు.
చనిపోయిన వారి ప్రతిరూపంగా..
బొలివియా(Bolivia skull festival) రాజధాని లా పాజ్‌లో స్కల్ ఫెస్టివల్‌ను వైభవంగా జరుపుకున్నారు. కుటుంబంలో చనిపోయిన వారి ప్రతిరూపంగా దాచుకున్న కాపాలాలను అందంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది నవంబర్ నెల ఆరంభంలో బొలివియాలోని ఐమారా ప్రజలు నటిటాస్ పేరుతో ఈ వేడుక నిర్వహిస్తారు. కుటుంబంలో చనిపోయిన వారి పుర్రెలను పూలతో అందంగా అలంకరించి ఆరాదిస్తారు. ప్రతీ వ్యక్తికి ఏడు ఆత్మలుంటాయని.. అందులో ఒకటి మానవ పుర్రె లోపల ఉంటుందని భావించి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమను ఆ పుర్రెలోని ఆత్మ రక్షిస్తుందని.. మంచి జరిగేలా చూస్తుందని భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా కపాలాలను అందమైన దండలు, టోపీలు, వివిధ ఉపకరణాలతో సుందరంగా అలంకరిస్తారు.
పుర్రెలకు ప్రార్థనలు..