తెలంగాణ

telangana

ETV Bharat / international

కెనడా ప్రధాని సతీమణికి కరోనా పాజిటివ్​ - canada prime minister wife news

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సతీమణి సోఫీ గ్రెగొరీకి కరోనా పాజిటివ్​గా తేలినట్లు ఆ దేశ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఈ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది.

కెనాడా ప్రధాని సతీమణికి కరోనా పాసిటివ్​
కెనాడా ప్రధాని సతీమణికి కరోనా పాసిటివ్​

By

Published : Mar 13, 2020, 8:47 AM IST

Updated : Mar 13, 2020, 2:29 PM IST

కెనడా ప్రధాని సతీమణికి కరోనా పాజిటివ్​

కరోనా మహమ్మారి దేశాధినేతల్ని సైతం వణికిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో సతీమణి సోఫీ గ్రెగొరీకి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. గురువారమే ఆమెకు ఫ్లూ సంబంధిత లక్షణాలు ఉండడంతో ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్యకు వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు నిన్న తెలిపారు. సోఫీ ఇటీవలే బ్రిటన్‌లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ కామెరూన్‌ అహ్మద్‌ వెల్లడించారు. లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. ట్రూడో మాత్రం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు.

గత కొన్ని రోజుల్లో సోఫీని కలిసిన వారందర్నీ గుర్తించి పరీక్షించనున్నట్లు కామెరూన్‌ తెలిపారు. వైద్యుల సూచన మేరకు రానున్న 14 రోజుల పాటు ప్రధాని ట్రూడో ఇంటికే పరిమితం కానున్నారని వెల్లడించారు. లక్షణాలు లేని కారణంగా ప్రస్తుతానికి ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం లేదన్నారు. ఈ రోజు ఆయన కెనడా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. గురువారం నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం కెనడాలో 138 మందికి ఈ వైరస్‌ సోకింది.

ఇదీ చూడండి:ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి

Last Updated : Mar 13, 2020, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details