తెలంగాణ

telangana

ETV Bharat / international

రైతులకు కెనడా ప్రధాని మద్దతు- భారత్​ ఫైర్​ - farm laws protest

భారత్​లో జరుగుతున్న రైతు నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు తమ దేశం ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. దీనిపై భారత్​ తీవ్రంగా స్పందించింది.

Canada will always be there to defend the right of peaceful protest: Trudeau on farmers protest
రైతు నిరసనలపై కెనడా ప్రధాని వ్యాఖ్య- భారత్​ ఫైర్​

By

Published : Dec 1, 2020, 3:43 PM IST

దేశంలో జరుగుతున్న రైతు నిరసనలకు మద్దతు పలికారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనలు ఉద్దేశించి మాట్లాడిన ఆయన... శాంతియుత నిరసనలకు ఎప్పుడూ తమ దేశం మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

గురునానక్​ దేవ్​ 551వ జయంతి సందర్భంగా కెనడాలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రూడో... భారత్​లోని రైతు నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల వ్యవహారంపై అంతర్జాతీయంగా స్పందించిన తొలి వ్యక్తి ట్రూడో కావడం గమనార్హం.

అలా అనడం సరికాదు

కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్​ తీవ్రంగా స్పందించింది. రైతు నిరసనలను ఉద్దేశించి ట్రూడో చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవిగా పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం దౌత్యపరమైన సంభాషణలు చేయకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ హితవు పలికింది.

ఇదీ చూడండి:బైడెన్​ చేతికి అమెరికా రహస్య సమాచారం

ABOUT THE AUTHOR

...view details