కరోనా వైరస్‌పై పోరాటంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. 12 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చేందుకు అనుమతిచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి రక్షణలో ఆయా వయస్సు పిల్లలకు ఈ టీకా సురక్షితం, సమర్థంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అడ్వైజర్ సుప్రియా శర్మ వెల్లడించారు.
జర్మనీకి చెందిన ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.