కార్చిచ్చు విధ్వంసం- దహనమవుతున్న సుందరమైన అటవీ ప్రాంతం అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. పొడి వాతావరణానికి బలమైన గాలులు తోడవడం వల్ల అంతకంతకూ విజృంభిస్తూ.. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద దావానలంగా మారింది. ఉత్తర కాలిఫోర్నియాలోని సుందరమైన అటవీ ప్రాంతాలను దహించివేస్తోంది.
ప్లూమాస్ కౌంటీలో అగ్నికి ఆహుతైన ఇళ్లు, వాహనాలు ప్లూమాస్ కౌంటీ, గ్రీన్విల్లేలో ఓ ఇంటి ముందు కాలిపోయిన విగ్రహం పూర్తిగా దగ్ధమైన గ్రిన్విల్లేలోని ఓ భవనం ముందు నుంచి వెళ్తున్న జింక ఉత్తర సియెర్రా నెవాడాలో 370 ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 14,000 భవనాలు కార్చిచ్చు వల్ల ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటివరకు 1,813 చదరపు కిలోమీటర్లు మేర దావానలం వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.
కార్చిచ్చు ధాటికి మోడుబారి రహదారిపై పడిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు కారులో వస్తువులను సర్దుకుంటున్న ఓ గ్రీన్విల్లే నివాసి షికాగో పార్క్‌లోని బేర్ నదిలో మంటల్లో కాలి బూడిదైన చెట్లు, కమ్మేసిన పొగ కార్చిచ్చును అదుపు చేస్తుండగా.. ఓ చెట్టు కొమ్మ విరిగిపడి నలుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కాల్పిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ దావానలం ధాటికి ఆహుతైన ప్రాంతాలను రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ సందర్శించారు. పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాలిఫోర్నియాలోని చెలరేగిన దావానం కారణంగా లాస్‌వేగాస్ నగరాన్ని కమ్మేసిన పొగ ఇదీచూడండి:News in Images: కాలిఫోర్నియాలో భయానక దృశ్యాలు