నిత్యం రద్దిగా ఉండే మహానగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు అంతా ఇంతా కాదు... కాలుష్యం కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా అనేక దేశాల్లో ముఖ్య నగరాలను జోడిస్తూ మెట్రో రైళ్లు పరుగులు తీస్తుంటాయి. కానీ బొలీవియా మాత్రం ఆకాశ మార్గమైన కేబుల్ కార్లను తన ప్రధాన రవాణా వ్యవస్థల్లో ఒకటిగా చేసుకుంది.
బొలీవియాలో కేబుల్ కార్లు సందడి చేస్తున్నాయి. చివరి దశగా లా పాజ్ నుంచి ఎల్ ఆల్టో వరకు 33 కిలోమీటర్ల మేర నిర్మించిన కేబుల్ కార్ల ప్రాజెక్టు శనివారం అందుబాటులోకి వచ్చింది.