ప్రముఖ పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌కు (britney spears news) స్వేచ్ఛ లభించింది. తాను చేస్తున్న న్యాయ పోరాటం ఫలించి.. తన తండ్రి జేమ్స్ స్పియర్స్(Britney Spears Father) చెర నుంచి విముక్తి దొరికింది. ఈ మేరకు అమెరికా లాస్ ఏంజలెస్‌లోని కోర్టు న్యాయమూర్తి.. జేమ్స్‌కు సంరక్షణ బాధ్యతలను(Britney conservatorship) రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.
బ్రిట్నీ 2008లో మానసిక సమస్యలకు గురికావడం వల్ల... ఆమె సంరక్షణ బాధ్యతలను తన తండ్రి చేపట్టారు. సుమారు 14 ఏళ్లుగా కుమార్తె జీవిత నిర్ణయాలను.. డబ్బులు, ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే, తన స్వేచ్ఛకు తండ్రి జేమ్స్ ఆటంకంగా మారారని, సంరక్షణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని కొంతకాలంగా బ్రిట్నీ(britney spears news) న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. దీంతో తాజాగా జేమ్స్‌ను సంరక్షునిగా తప్పిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.