తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1,473 మరణాలు - latest international news

బ్రెజిల్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 1,473మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 15వేలు దాటింది. వైరస్​ ప్రభావం తగ్గిందని భావించిన దక్షిణ కొరియాలో రోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Brazil has new high in COVID deaths
బ్రెజిల్​లో కరోనా మరణాల రికార్డు

By

Published : Jun 5, 2020, 11:14 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానంలో నిలిచిన బ్రెజిల్​లో వైరస్​ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఒక్క రోజులో ఆ దేశంలో 1,473మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. 24 గంటల్లో ఇంతమంది మరణించడం ఆ దేశంలో ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 15వేల 840కి చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 34వేల 39కి పెరిగింది.

దక్షిణ కొరియాలో 39 కొత్త కేసులు

దక్షిణ కొరియాలో కొత్తగా 39 కేసులు నమోదయ్యాయి. వీటిలో 34 కేసులు వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్న రాజధాని సియోల్ ప్రాంతానికి చెందినవే. వైరస్​ ప్రభావం పూర్తిగా తగ్గిందని భావించిన తర్వాత రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతుండటం ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది.

దక్షిణ కొరియాలో మొత్తం కేసుల సంఖ్య 11వేల 668కి చేరింది. ఇప్పటి వరకు 273మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 67లక్షల 2వేల 793కి చేరింది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 3లక్షల 93వేల 212మంది మరణించారు. వైరస్ బారిన పడి 32లక్షల 52వేల 308 మంది కోలుకున్నారు.

అత్యధిక కేసులున్న దేశాలు..

# దేశం కేసులు మరణాలు
1 అమెరికా 19,24,051 110,173
2 బ్రెజిల్​ 6,15,870 34,039
3 రష్యా 4,41,108 5,384
4 స్పెయిన్​ 2,87,740 27,133
5 బ్రిటన్​ 2,81,661 39,904
6 ఇటలీ 2,34,013 33,689
7 భారత్​ 2,26,770 6,348
8 జర్మనీ 1,84,923 8,736
9 పెరూ 1,83,198 5,031
10 టర్కీ 1,67,410 4,630

ABOUT THE AUTHOR

...view details