బ్రెజిల్వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం(1.85 బిలియన్ డాలర్లు) కోత విధించడంపై నిరసనకు దిగారు. అన్ని నగరాల్లో రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించారు. అధ్యక్షుడు జేర్ బాల్సొనారోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రియో డి జెనిరోలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఆందోళనకారులు బస్సుకు నిప్పంటించారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.