తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2019, 11:08 AM IST

ETV Bharat / international

'బోయింగ్' విమానాలపై అమెరికా నిషేధం

బోయింగ్​ 737 మ్యాక్స్​ విమాన సేవలను రద్దు చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అత్యవసర ఆదేశాలు జారీ చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు.

డొనాల్డ్​ ట్రంప్​

డొనాల్డ్​ ట్రంప్​
ఇథియోపియా ఘటన తర్వాత బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానాలకు ప్రపంచ దేశాలు అనుమతులు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే భారత్​, చైనా సహా ఇతర దేశాలు బోయింగ్​ 737 వినాన సర్వీసులను నిలిపేశాయి. తాజాగా అమెరికా కూడా ఈ విమానాల సేవలను దేశ వ్యాప్తంగా రద్దు చేయనుంది.

"బోయింగ్​ 737 మ్యాక్స్​ 8, మ్యాక్స్​ 9 విమానాల సేవలను నిలిపివేసే విధంగా అత్యవసర ఆదేశాలు జారీ చేస్తాం. వాటితో అనుసంధానమైన విమానాలపైనా చర్యలు తీసుకుంటాం"
-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details