తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​ స్పీచ్​ రైటర్​ వినయ్​పై ప్రశంసల జల్లు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సర్కారులో స్పీచ్​ రైటింగ్​ విభాగం అధ్యక్షుడిగా నియామకమైన భారతీయ-అమెరికన్​ వినయ్ ​రెడ్డి పేరు మార్మోగిపోతోంది. ప్రమాణ స్వీకారం కోసం రాసిన స్పీచ్​​తో ఆయన అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శక్తిమంతమైన పదాలతో.. పదునైన వాక్యాలతో చక్కటి ప్రసంగాన్ని బైడెన్​కు అందించారు వినయ్​.

Biden's inaugural address written by Indian-American earns praise for its powerful message
బైడెన్​ స్పీచ్​ రైటర్​ వినయ్​పై ప్రశంసల జల్లు

By

Published : Jan 21, 2021, 4:15 PM IST

అమెరికా అధ్యక్షుడు బైడెన్ బృందంలో భారతీయ-అమెరికన్​లకు పెద్దపీట వేశారు. వారిలో ఒకరు స్పీచ్​రైటెర్​ వినయ్​రెడ్డి. ప్రస్తుతం ఆయన పేరు మార్మోగిపోతోంది. బైడెన్​ ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని రాసిన వినయ్​.. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. బైడెన్​ తన పాలనలో సాధించబోయే లక్ష్యాలు, అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐకమత్యం, ప్రజాస్వామ్యం ప్రాముఖ్యత వంటి అంశాల గురించి పదునైన పదాలతో ఎంతో గొప్పగా ప్రసంగించడమే ఇందుకు కారణం.

'బైడెన్ ప్రసంగం.. నమ్రతతో కూడుకున్నది, కఠినమైనది, గంభీరమైంది, ప్రశాంతమైంది, ఉత్తేజకరమైంది' అంటూ మైఖేల్​ అనే చరిత్రకారుడు​ ట్వీట్​ చేశారు.

బైడెన్​ స్పీచ్​లోని కొన్ని ఆణిముత్యాలు..

  • ఈ రోజు చారిత్రకమైంది. అమెరికన్ల రోజు. ప్రజాస్వామ్యానిది. ఈ రోజు జరుపుకుంటున్న విజయోత్సవం ఏ ఒక్కరిదీ కాదు అందరిది. ప్రజాస్వామ్యం విలువైంది, సున్నితమైంది.
  • ఐకమత్యం లేకపోతే శాంతి లేదు. అక్కడ కోపతాపాలే మిగులుతాయి. అభివృద్ధి ఉండదు. జాతి ఉండదు.. ఘర్షణలే జరుగుతాయి. దేశం చారిత్రక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఐకమత్యంతోనే ముందుకు వెళ్లగలం.
  • కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ఇక్కడ శాంతియుతంగా సమావేశమవుతున్నాం. భయాందోళన నుంచి దూరంగా వెళ్లడం, హింసాత్మక ఘటనలు ఎప్పటికీ జరగకుండా ఉండడం ప్రజాస్వామ్యంతోనే సాధ్యం.
  • బైడెన్ ఒకనొక సమయంలో 'అధ్యక్షుడు ప్రజలందరి కోసం..' అంటూ వ్యాఖ్యానించారు.

ఇలా బైడెన్ నోట జారువాలిన ప్రతి మాట తూటలా పేలింది. అందరినీ ఆకర్షించింది. ఆ మాటలన్ని వినయ్​ హృదయాంతరాల్లోంచి బయటకు వచ్చి.. ఆయన కలం ద్వారా అక్షరరూపం దాల్చాయని చెప్పొచ్చు.

ఇదీ చూడండి:బైడెన్​ బృందంలో కీలకంగా భారతీయులు!

ABOUT THE AUTHOR

...view details