అమెరికాలో వ్యాక్సినేషన్ (US Vaccination news) వేగవంతం చేసేందుకు జో బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు టీకా తప్పనిసరి అనే నిబంధనను (US Vaccine mandate) ఇటీవలే తీసుకొచ్చారు బైడెన్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు అందించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Biden Vaccine Executive Order) ప్రకారం నవంబరు 22 నాటికి దాదాపు 40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్వేతసౌధంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తైంది. కానీ.. నిఘా, భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉద్యోగులకు టీకా పంపిణీ (US Vaccine mandatedeadline ) పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోని ప్రజలు టీకా తీసుకోవాలని బైడెన్ ఒప్పించాలంటే.. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బైడెన్‌కు ఇది పరీక్ష వంటిదని చెబుతున్నారు. ప్రైవేటు ఉద్యోగులకు టీకా తప్పనిసరి నిబంధనల అమలుకు సైతం ఇదే కీలకమని పేర్కొంటున్నారు.
ఆ నిబంధనపై న్యాయపోరాటం