Biden Putin call: ఉక్రేయిన్ సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బీజింగ్ ఒలింపిక్స్ ముగిసేలోపు రష్యా ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో బైడెన్ ఫోన్లో సంభాషించారు. దాదాపు గంట పాటు పుతిన్‌తో మాట్లాడిన బైడెన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
బైడెన్ వార్నింగ్..
ఉక్రేయిన్‌పై దండయాత్రకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బైడెన్ పుతిన్‌ను హెచ్చరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని బైడెన్ పేర్కొన్నట్లు వెల్లడించింది. దౌత్యపరంగా చర్యలు చేపట్టేందుకు అమెరికా కట్టుబడి ఉన్నా.. పరిస్థితి దిగజారితే మిత్రదేశాల సహకారంతో మరింత దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ స్పష్టం చేసినట్లు పేర్కొంది.