కాబుల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన 13 మంది అమెరికా సైనికులకు నివాళులు అర్పించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి డెలవేర్‌లోని డోవర్ ఎయిర్ ఫోర్స్ వద్దకు చేరుకున్నారు బైడెన్. సైనికుల మృతదేహాలకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిశారు.
ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన సైనికులంతా 20-31 ఏళ్లలోపు వారే. వారు అమెరికాలోని కాలిఫోర్నియా, మసాచుసెట్స్ రాష్ట్రాలకు చెందినవారు. మృతుల్లో ఐదుగురికి కేవలం 20ఏళ్లే. గతేడాది ఫిబ్రవరి నుంచి 13 మంది అమెరికా సైనికులు మరణించటం ఇదే తొలిసారి.