అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(biden news).. భేటీలు, చర్చలతో ఈ వారం బిజీబిజీగా గడపనున్నారు. ఉన్నతస్థాయి సమావేశాలు, అంతర్జాతీయ నేతలతో చర్చలతో పాటు అత్యంత కీలకమైన ఐరాస జనరల్ అసెంబ్లీలో(unga 2021) ప్రసంగించనున్నారు. అఫ్గాన్ పరిణామాలు, కొవిడ్ కట్టడి, టీకా పంపిణీ వంటి అంశాల నేపథ్యంలో బైడెన్ కార్యచరణకు ప్రాధాన్యం సంతరించుకుంది(joe biden news today).
యూఎన్‌జీఏలో ప్రసంగం...
సెప్టెంబర్ 21-27 మధ్య ఐరాస సర్వసభ్య సమావేశం జరగనుంది. దేశాధ్యక్షుడి హోదాలో బైడెన్ తొలిసారి ఇక్కడ ప్రసంగించనున్నారు. మంగళవారం జరగనున్న సమావేశం కోసం సోమవారం న్యూయార్క్ వెళ్లారు.
అఫ్గాన్ సంక్షోభంలో అమెరికా పాత్రపై(biden afghanistan news) ప్రపంచ దేశాలు కొంత అసహనంతో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కోసం బైడెన్ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలపైనా వ్యతిరేకత ఎదురైంది. కొవిడ్ నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు, చైనాను మిలిటరీ, ఆర్థికపరంగా అమెరికా ఎదుర్కొంటున్న తీరుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో 'అమెరికా ఫస్ట్' నినాదంతో ముందుకు సాగింది అగ్రరాజ్యం. బైడెన్.. తన విధానాలతో అమెరికా సహకారం పెంపొందిస్తారని మిత్ర దేశాలు భావించాయి. అది అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల మిత్ర దేశాలు కాస్త అసంతృప్తితో ఉన్నాయి. ఈ తరుణంలో ఐరాస జనరల్ అసెంబ్లీలో బైడెన్ ప్రసంగం ఎలా ఉండనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:-బైడెన్‌ను కాపాడిన వ్యక్తిని అఫ్గాన్‌లోనే వదిలేసిన అమెరికా!
ఈ నేపథ్యంలో బైడెన్ ప్రసంగంపై శ్వేతసౌధం కొన్ని విషయాలు వెల్లడించింది. 20ఏళ్ల అఫ్గాన్ యుద్ధానికి ముగింపు పడిందని, ఇక కొత్త శకాన్ని మొదలుపెట్టే సమయం వచ్చిందని.. బైడెన్ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి తెలిజేయనున్నట్టు తెలిపింది. అదే సమయంలో కరోనా సంక్షోభంపై పోరు కోసం మిత్ర, శత్రుదేశాలను కలుపుకుని ముందుకు సాగిపోవాలన్న సంకల్పంతో ఆయన కీలక ప్రసంగం చేస్తారని పేర్కొంది.
గుటెరస్‌తో భేటీ...
జో బైడెన్.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని గుటెరస్‌తో(antonio guterres un) భేటీ అయ్యారు. ఐరాస, సంస్థ విలువలపై తమకు విశ్వాసం ఉందని తెలిపారు. ప్రస్తుత కొవిడ్- వాతావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాలు కలిసిగట్టుగా పనిచేయాల్సిన అవసరం మునుపెన్నడూ లేనంతగా ఉందని బైడెన్ అభిప్రాయపడ్డారు.
"అమెరికా ఈజ్ బ్యాక్. ఐరాస విలువలపై మాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం ఉన్న కొవిడ్, వాతావరణ సమస్యలకు అంతర్జాతీయంగా పరిష్కారాలు అత్యవసరం. ఏ ఒక్క దేశంతోనూ పని జరగదు. అందరు కలిసిగట్టుగా ముందుకు సాగాలి. విలువలు, ప్రాథమిక సూత్రాల కారణంగా అమెరికా-ఐరాస మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బంధం అత్యంత కీలకంగా మారనుంది."