తెలంగాణ

telangana

ETV Bharat / international

జో బైడెన్​పై జూనియర్​ ట్రంప్​ ఫైర్​ - biden and china

అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడన్​ కుటుంబం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు జూనియర్​ ట్రంప్​. బైడెన్​ కుమారుడు హంటర్​ బైడెన్​.. చైనాకు అమ్ముడుపోయారని విమర్శించారు. అందుకే బైడెన్​ కూడా చైనాకు మద్దతిస్తున్నట్టు పేర్కొన్నారు.

Biden, could be soft on China; not good for India: Donald Trump Jr
'జో బైడెన్​ చైనాకు అనుకూలం'

By

Published : Oct 19, 2020, 10:11 AM IST

Updated : Oct 19, 2020, 10:24 AM IST

డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్చించారు జూనియర్ ట్రంప్​. హంటర్ బైడెన్ చైనాకు 1.5 బిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. అందుకే ఆయన చైనాకు వంతపాడుతున్నారని జూనియర్ ట్రంప్ విమర్శించారు.

బైడెన్​ అవినీతిపై పుస్తకం..

చైనా నుంచి ఎలాంటి ప్రమాదం ఉందో భారతీయ-అమెరికన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని జూనియర్​ ట్రంప్​ తెలిపారు. ఈ సందర్భంగా జో బైడెన్.. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై జూనియర్‌ ట్రంప్ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో జో బైడెన్ కుటుంబం అవినీతి అక్రమాలు పొందుపరిచినట్లు వివరించారు. ఈ పుస్తకాలపై సంతకం చేసి తన మద్దతుదారులకు అందించారు జూనియర్​ ట్రంప్​.

Last Updated : Oct 19, 2020, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details